తెలుగులో స్టార్ హీరోలతో నటించిన బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తన అభినయంతో, అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాని నవంబర్ 22, 2009న వివాహం చేసుకున్న ఈ అమ్మడు… పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తి దూరమైంది. ఇంటి పనులతో బిజీగా ఉంటూనే తన కుమారుడు వియాన్ బాగోగులు చూసుకుంటూ కాలం గడుపుతూ వచ్చింది. అయితే పదమూడేళ్ళుగా వెండితెరకి దూరంగా ఉన్న శిల్పా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. “నికమ్మ” అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతుంది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న శిల్ప సముద్రంలో తన ఏడేళ్ల కుమారుడు వియాన్‌కు ఊపిరి ఎలా పీల్చుకోవాలో నేర్పించారట. తన కుమారుడితో కలిసి సముద్రంలో మునిగి సహజంగా ఎలా ఊపిరి పీల్చుకోవాలో ఆ ట్రిక్స్ అన్నీ నేర్పించిందట. ఈ విషయాన్ని శిల్ప ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ వీడియో షేర్ చేశారు. తాజాగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు విపరీతమైన స్పందన వస్తోంది. శిల్ప ఎందరో తల్లులకు రోల్ మోడల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
previous post
స్టార్ హీరోలపై ఉత్తేజ్ వ్యాఖ్యలు