telugu navyamedia
సినిమా వార్తలు

అడల్ట్ మూవీ దర్శకుడితో అరవింద్ స్వామి

Aravind-Swamy

తమిళ చిత్రం “తనీ ఒరువన్”తో అరవింద స్వామి సినిమాల్లోకి రీమేక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ “ధృవ‌”లో కూడా ఆయన విల‌న్‌గా న‌టించారు. అప్పటి నుండి విలన్‌గా, హీరోగా సినిమాలను చేస్తూ వస్తున్నారు. రీ ఎంట్రీ త‌ర్వాత స్క్రిప్ట్స్ ఎంపిక‌లో ఈ సీనియ‌ర్ హీరో అచితూచి అడుగులేస్తున్నారు. “నాగాసురన్” సినిమా తర్వాత ఆయ‌న మ‌రో సినిమాలో న‌టించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కారణం. త్వ‌ర‌లోనే అర‌వింద‌స్వామి ఓ డిటెక్టివ్ థ్రిల్ల‌ర్‌లో నటించ‌బోతున్నారు. “హ‌ర‌హ‌ర మ‌హాదేవ‌కి”, “ఇరుట్టు అర‌యిల్ మొర‌ట్టుకుత్తు” (చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు) వంటి అడ‌ల్ట్ కంటెంట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన సంతోష్ పి.జ‌య‌కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సంతోష్ తెర‌కెక్కించిన చిత్రాల‌కు భిన్నంగా థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సాగే చిత్ర‌మిది. ఇందులో అర‌వింద‌స్వామి సి.బి.సి.ఐ.డి ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. నిజ ఘ‌ట‌నల ఆధారంగా సినిమా రూపొంద‌నుందని సమాచారం.

Related posts