telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పుష్ప’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి!

mandi ad troubles vijay setupati

సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తమిళ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు సమాచారం. డేట్లు సర్దుబాటు కాకపోవడమే దీనికి కారణం అంటున్నారు. కరోనా వైరస్ విజృంభించడంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని వల్ల సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. వాటిలో ‘పుష్ప’ కూడా ఉంది. మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. అందుకే, తాను ఇక డేట్లు సర్దుబాటు చేయలేనని, ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నానని సుకుమార్‌కు విజయ్ సేతుపతి చెప్పేశారట. అయితే, విజయ్ సేతుపతి పాత్రలో కచ్చితంగా ఒక తమిళ నటుడినే పెట్టాలని సుకుమార్ ఫిక్స్ అయ్యారని సమాచారం.

Related posts