telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

బీజేపీకి అమీర్ ఖాన్ మద్ధతు ?

Amir-Khan

బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈరోజు తన 54వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ముంబై బంద్రాలో ఉన్న తన నివాసంలో భార్య కిరణ్ రావు, అభిమానులు, మీడియా సమక్షంలో పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు అమీర్ ఖాన్. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ మీడియా సమావేశంలో కోరారు. అంతేకాదు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో ఎన్నారైలు ఇక్కడకు వచ్చి ఓటు వేయడం కష్టసాధ్యమని, వారి కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో మీరు బీజేపీకి మద్దతు తెలుపుతారా? అనే ప్రశ్న ఎదురైంది అమీర్ ఖాన్ కు. దీనికి సమాధానంగా అమీర్ ఖాన్ తాను ఏ పార్టీకి మద్దతు ప్రకటించనని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో భారీగా పోలింగ్ తమవంతుగా సినిమా నటీనటులు, సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరిన విషయం తెలిసిందే.

Related posts