ప్రస్తుతం తెలుగు హీరోలు వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో హీరో శర్వానంద్ కూడా ఒక్కడు. అయితే ప్రస్తుతం శర్వా చేస్తున్న సినిమాలో ‘శ్రీకారం’ ఒక్కటి. ఈ సినిమాతో కిషోర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. 14రీల్స్ పతాకంపై రాం అచంట, గోపీ అచంట నిర్మిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా శ్రీకారం మూవీ నుండి అప్డేట్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా నుండి ”హెయ్ అబ్బాయి” రిటికల్ పాటను విడుదల చిత్రబృందం. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ అలాగే పాటలకు కు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా మొత్తం వ్యవసాయం బ్యాక్ డ్రాప్‌లో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పూర్తిగా ఈ మూవీ గ్రామీణ ప్రాంతలోనే తీసినట్లు సమాచారం. ఇక శివరాత్రి సందర్బంగా విడుదల అవుతున్న ఈ సినిమా ఏ మేర అభిమానులను అలరిస్తుందో చూడాలి మరి.
previous post
next post