telugu navyamedia
సినిమా వార్తలు

రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం లాంటిది- రాజ‌మౌళి

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే శనివారం చిక్‌బళ్లాపూర్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్​ హీరో శివరాజ్​ కుమార్​, సీఎం బసవరాజ్‌ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరుపై ప్రశంసల జల్లు కురింపించారు రాజమౌళి.

ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ..నా రాముడు నా భీముడు లను అడగ్గానే మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకొన్నారు. థ్యాంక్స్‌ అనే మాట చాలా చిన్నద‌ని అన్నారు.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం లాంటిదని రాజమౌళి అభివర్ణించాడు. మెగా అభిమానులను బంగాళాఖాతంతో, నందమూరి అభిమానులను అరేబియా మహాసముద్రంతో పోల్చాడు జక్కన్న. ఇదంతా చూస్తుంటే నాకు శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది. ఈ మైత్రీ బందం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అని రాజమౌళి అన్నారు

రామ్‌చరణ్‌ తేజ్‌కు ఆంజనేయస్వామి పేరు చిరంజీవిగారు ఎందుకు పేరు పెట్టారో నాకు తెలియదు. కానీ, ఆంజనేయస్వామిలా చరణ్‌ బలమేంటో అతడికి తెలియదు. అలాగే హరికృష్ణగారు ఎందుకు తారక రామ్‌ అని పెట్టారో తెలియదు. కానీ, నిజంగా తారక రాముడే. తనబలమేంటో రాముడికి తెలుసు.

అలాగే తన నటన సామర్థ్యం ఏంటో తెలిసిన వ్యక్తి తారక్‌. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘చరణ్‌ గొప్ప నటుడు ఆ విషయం అతడికి తెలియదు.. ఎన్టీఆర్‌ గొప్ప నటుడు ఆ విషయం అతనికి తెలుసు’ అలాంటి ఇద్దరు నటులు నా సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది..

Related posts