telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Srireddy

సంచలన నటి శ్రీరెడ్డి వేధింపుల వ్యవహారం బయటపెట్టి పలువురిపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొందరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పై అయితే మరి ఘోరంగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళమెత్తి అందరిని దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్,రానా, అభిరామ్, నాని, విశాల్ వంటి హీరోలను టార్గెట్ చేసి కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ చెన్నైలో ఉంటుంది. అపుడపుడు తను చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె దర్శకుడు బోయపాటి శ్రీను పై సంచలన ఆరోపణలు చేసింది. బోయపాటి శ్రీను సినిమాల్లో ఎక్కువగా నటించే ఒక నటితో ఆయనకు ఎఫైర్ ఉందంటూ సంచనల ఆరోపణలు చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. బోయపాటి శ్రీను గారు ఆమె లేకుండా ఏ సినిమాలు కంప్లీట్ చేయరంట కదా అంటూ రాయడానికి వీలులేని పదాలను వాడింది. అంతేకాదు ఆ నటిమణి, తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసి దారుణమైన కామెంట్స్ చేసింది.

Related posts