telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“విజిల్ ” మా వ్యూ

Bigil

బ్యానర్ తెలుగులో : ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌
బ్యాన‌ర్‌ : ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు : విజ‌య్‌, న‌య‌న‌తార‌, జాకీష్రాఫ్‌, యోగిబాబు త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: అట్లీ
సంగీతం : ఎ.ఆర్.రెహ‌మాన్‌
కెమెరా : జీకే విష్ణు
ఎడిటింగ్‌ : రూబెన్‌
నిర్మాత‌లు : క‌ల్పాతి అగోరాం, క‌ల్పాతి ఎస్‌.గ‌ణేష్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్‌

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా “రాజా రాణి” ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’. తెలుగులో బిగిల్ అంటే “విజిల్” అని అర్థం. తెలుగులో ఈ చిత్రం “విజిల్” పేరుతో విడుదలైంది. గతకొంత కాలంగా తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. వరుస డిజాస్టర్లుగా నిలుస్తూ సినిమా హక్కులను కొన్న నిర్మాతలకు నష్టాలను మిగులుస్తున్నాయి. దీపావళి కానుకగా భారీగా విడుదలైన “విజిల్” సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ :
విశాఖపట్నంలో రాజప్ప (విజయ్) అనే రౌడీ తన బస్తీ ప్రజల బాగోగులు చూసుకుంటాడు. రాజప్ప కొడుకు మైఖేల్ అలియాస్ బిగిల్ (విజయ్) పెద్ద ఫుట్ బాల్ ప్లేయర్. అతన్ని గొడవలకు దూరంగా ఉంచుతాడు రాజప్ప. ఈ క్రమంలో రాజప్పను ప్రత్యర్థులు చంపేస్తారు. దీంతో మైకేల్ క‌త్తి పట్టాల్సి వస్తుంది. అత‌ని స్నేహితుడు కోచింగ్ ఇస్తున్న మ‌హిళ‌ల ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌కు నాట‌కీయ ప‌రిస్థితుల మ‌ధ్య గాయాలవుతాయి. అత‌ని స్థానంలో మైకేల్ కోచ్‌గా వెళ‌తాడు. రౌడీ అయిన మైకేల్‌ను కోచ్‌లో ఫుట్‌బాల్ టీమ్‌లో అమ్మాయిలు అంగీక‌రిస్తారా? ఒక ఛాంపియన్ ఫుట్‌బాలర్ జీవితం తన స్నేహితుడి మరణంతో ఎలాంటి మలుపు తిరిగింది? ఆ క్రమంలో అతనికి ఎదురైన అవరోధాలు ఏంటి ? చివరకు ఏం జరిగింది ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
విజయ్ ఈ చిత్రంలో తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రల్లో కన్పిస్తాడు. విజయ్ నటించిన తండ్రి రాజప్ప పాత్ర మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే… కొడుకు మైఖేల్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయ్ రెండు పాత్రల్లోని వేరియేషన్ ను తన నటనతో బాగా చూపించారు. నయనతార అందంగా ఉంది. తన పాత్ర పరిధిమేర నటించి మెప్పిస్తుంది. జాకీష్రాఫ్ విల‌న్‌గా సరిగ్గా సరిపోయారు. ఇంకా ఫుట్‌బాల్ టీమ్‌గా నటించిన రెబా మోనిక‌, అమృత, వ‌ర్ష బొల్ల‌మ్మ‌, ఇందుజ‌ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారనే చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు :
ఇక దర్శకుడి విషయానికొస్తే… అట్లీ ఈ సినిమాలో హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశారు. ఈ కథకు యాక్షన్, ఎమోషన్స్, డ్రామాను జోడించి ఒక కమర్షియల్ చిత్రంగా తీర్చిదిద్దారు అట్లీ. దీనికి తోడు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రాయప్పన్ క్యారెక్టర్ సినిమాకు ప్లస్ పాయింట్. మహిళా సాధికారత అనే పాయింట్ ను తీసుకుని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించాడు అట్లీ. సినిమా ద్వితీయార్థంలో శ్రీరామ‌కృష్ణ రాసిన డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. రాకేందు మౌళి పాట‌లు కనీసం గుర్తు కూడా ఉండవు. నేప‌థ్య సంగీతం బావుంది. విష్ణు కెమెరా ప‌నితనం సూపర్. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.

రేటింగ్ : 3/5

Related posts