telugu navyamedia
సినిమా వార్తలు

స‌మంతా వ‌ల్లే అదంతా నేర్చుకున్నా..

మెగా కోడలు, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ భార్య‌ ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాస్పిటల్ పనులు, బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉంటుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూ ఉపాసన ఎన్నడూ లేనివిధంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోంది. మొదటి నుంచి ఉపాసన, హీరోయిన్ సమంత మంచి స్నేహితులే. ఫిట్‌నెస్‌, ఆరోగ్యం, మహిళా శక్తి వంటి ఎన్నో విషయాల్లో వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. గతంలో ఉపాసన సొంత వెబ్‌సైట్‌ యువర్‌ లైఫ్‌.కో.ఇన్‌కు సామ్‌ గెస్ట్‌ ఎడిటర్‌గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Pic Talk: Sam, Upasana Hold Dumbbell

ఇటీవ‌ల ఛాన‌ల్‌కు ఇచ్చిన‌ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.సమంత నుంచి తను చాలా నేర్చుకున్నానని చెప్పింది.”నేను తెలంగాణ బిడ్డను.. మాకు పండగలప్పుడు నాన్ వెజ్ తినడం అలవాటు.. దసరాకు కూడా నేను మాంసం తింటాను.. కానీ, ఎప్పుడైతే సమంతను కలిశానో, ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టానో మాంసం తినడం తగ్గించాను.

'Take charge of your life': Apollo's Upasana Kamineni on new wellness  platform - The Hindu

ఆమె చాలా మంచిది. ఆమెది చాలా స్వచ్ఛమైన మనసు..సమంతది నిజమైన ప్రేమ’.. కానీ, అది చాల తక్కువమందికే తెలుసు. సమంతలో సాయం చేసే గుణం ఎక్కువ ఉంటుంది.. అది అందరికి నచ్చుతుంది. ఎన్నో విషయాల్లో ఆమె నాకు సాయం చేసింది” అంటూ సపేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Related posts