దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జాన్వీ నటించిన “గుంజన్‌సక్సేనా : ది కార్గిల్ గర్ల్” చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనను ఎవరూ చూడటం లేదనుకుని బాబాయ్ పాటకు వేసిన డాన్స్ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ‘గుంజన్ సక్సేనా’ చిత్రంలో జాన్వీ సోదరుడిగా నటించిన అంగద్ బేడీ డాన్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో తీసిన వీడియోను అంగద్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. “అనిల్ సర్! ఇది మీకు అంకితం. గుంజన్ సక్సేనాలో రిహార్సల్ చేస్తున్న వీడియో ఇది” అని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అనీల్‌కపూర్ సాంగ్ ‘మై నేమ్ ఈజ్ లఖన్..’ పాటకు అంగద్, జాన్వీకపూర్ డాన్స్ చేశారు. ప్రముఖ నిర్మాత బోనీకపూర్, శ్రీదేవిల తనయ జాన్వీకపూర్‌కు స్టార్ నటుడు అనీల్‌కపూర్ బాబాయ్ అనే సంగతి తెలిసిందే.
previous post
నాకొడుకు ‘దొంగ నా కొడుకు!’… రవితేజ ఆసక్తికర పోస్ట్…