telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్ సేవలకు రూ.25లక్షల ఆర్థిక సాయం

మాటలకంటే సేవలందించే చేతులు మంచివని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఓదార్పులు, భరోసా ఇచ్చేకంటే చేతనైన సాయంచేయడం ఉత్తమమన్నారు. హైదరాబాద్ లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ యోధ లైఫ్ లైన్ డ‌యాగ్నస్టిక్స్ వ్యవస్థాపకుడు సుధాకర్ కంచర్ల, మెగాస్టార్ చిరంజీవి ట్రస్టు రూ.25లక్షల రూపాయల నగదు చెక్కును విరాళంగా అందించారు.

బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో సేవలు అందిస్తున్న చిరంజీవి సేవలను గుర్తించి… సాయం అందిస్తున్నామని దాత పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంక‌య్య నాయుడు చేతుల మీదుగా యోధా లైఫ్ డ‌యాగ్నస్టిక్స్ అధినేత సుధాక‌ర్ రూ.25 లక్షల విరాళం ట్రస్ట్ సేవ‌ల కోసం అందించారు. తన ట్రస్టుకు అందించిన విరాళాన్ని స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి దాత సుధాకర్ కంచర్లకు కృత‌జ్ఞత‌లు తెలిపారు. ప్రతిపైసా అవసరార్థులకోసం వెచ్చిస్తామన్నారు.

సినీపరిశ్రమకు చెందిన కళాకారులకు, టెక్నీషియన్లకు డ‌యాగ్నసిస్ సెంట‌ర్ ద్వారా రోగ నిర్ధారణ పరీక్షల్లో రాయితీతో సేవలు అందివ్వాలని అభ్యర్థించారు. దీంతో సానుకూలంగా స్పందించిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ యోధ లైఫ్ లైన్ డ‌యాగ్నస్టిక్స్ వ్యవస్థాపకుడు సుధాకర్ కంచర్ల యాభై శాతం రాయితీతో సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

.

Related posts