శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరియు శ్రీ లీల హీరో హీరోయిన్లు గా పెళ్లి సందD సినిమా దసరా కానుకగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతగా నడుస్తోన సమయంలో ఈ సినిమా హీరోయిన్ శ్రీలీల వివాదంలో చిక్కుకుంది.
తెలుగమ్మాయిగా మొదటి సినిమాతోనే శ్రీలీల మంచి పేరుతెచ్చుకుంది. శ్రీలీల తన కూతురు కాదంటూ.. ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నిరోజులుగా సూరపనేని శుభాకరరావు కూతురే శ్రీలీల అంటూ మీడియాలో వార్తలొస్తున్న నేపథ్యంలో శుభాకరరావు స్పదించాడు.
‘శ్రీలీల నా కూతరు కాదని.. ఆమె నా మాజీ భార్యకు మాత్రమే కూతురని. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. నా ఆస్తులను క్లెయిమ్ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారు. ఈ విషయంపై మేము న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.
నా మాజీభార్యతో విడాకుల కేసు ఇంకా కోర్టుల్లోనే నడుస్తుందని, హైకోర్టు నుండి సుప్రీం కోర్టువరకు వెళ్ళాం. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేసినని, సన్మాన సభలో ఏ ఆధారంతో తన కుమార్తెగా ప్రకటిస్తారని వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఫైర్ అయ్యారు.
విజయ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ కాపీ ఆరోపణలు