telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీ వాసుపై జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపణలు… స్పందించిన గీతాఆర్ట్స్

Sunitha

సునీత బోయ జూనియర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అయితే సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని గతంలో ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కత్తి మహేష్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయిన సునీత.. ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసనకు దిగడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది. ఫిల్మ్ చాంబర్‌లో మరో యువతి నిరసనకు దిగింది. సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్టు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది. గీతా ఆర్ట్స్‌లో సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి నిర్మాత బన్నీ వాసు మోసం చేశారంటూ సునీత ఆరోపించారు. సునీత అంశం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారుతోంది. ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేస్తుండగా ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పోలీసులు సునీతకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫ్యాన్స్ లో సునీత బన్నీ వాసుపై విమర్శలు చేసింది. ఇందులో జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సంబంధం లేదని, తాను ఆరోపణలు చేస్తోంది బన్నీ వాసుపై అని సునీత వీడియోలో తెలిపింది. కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా జనసేన, పవన్ కళ్యాణ్ ని ఈ వివాదంలోకి లాగుతున్నట్లు సునీత పేర్కొంది. దీనిపై గీతా ఆర్ట్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. సునీత పేరు ప్రస్తావించకుండా జరుగుతున్న వివాదం గురించి క్లారిటీ ఇచ్చారు.

“గత కొన్ని రోజులుగా మేము ఓ మహిళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గీతా ఆర్ట్స్ ఆఫీస్ గేటు వద్ద, తమ షూటింగ్ లొకేషన్స్ వద్దకు వచ్చి అగ్రెసివ్ గా ప్రవర్తిస్తోంది. తమ చిత్రాల్లో క్యారెక్టర్ ఇమ్మని డిమాండ్ చేస్తోంది. దీనిపై విచారణ జరిపించేందుకు తాము పోలీస్ కేసు నమోదు చేశాం. ఫిలిం ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేశాం. తాము ఎదుర్కొంటున్న సమస్యని కొన్ని మీడియా సంస్థలు తప్పుదోవ పట్టిస్తూ.. వారికీ అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ వివాదంపై క్లారిటీ కావాలనుకునే వారు గీతా ఆర్ట్స్ సంస్థని, ఫిలిం ఛాంబర్ ని సంప్రదించవచ్చు” అని గీతా ఆర్ట్స్ ప్రకటన విడుదల చేసింది.

Related posts