telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్ 18, సోమవారం రాశిఫలాలు..

మేషం
సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి.కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది.

వృషభం
ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, కార్యాలయ పనులతో హడావుడిగా గడుపుతారు. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ ఆశయాలు నెరవేరవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త ఉద్యోగాలలో చేరతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం
వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారి, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. ప్రేమికుల వ్యవహారం సమస్యాత్మకమవుతుంది.

కర్కాటకం
ఆకస్మిక ప్రయాణాలు..మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది. ఆదాయం కంటే ఖర్చులు అధికం అవుతాయి పనుల్లో తొందరపాటు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.స్వార్ధపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి.

సింహం
పరిచయాలు పెరుగుతాయి. స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ కార్యక్రమాల సమాచారం అందుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.

కన్య
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. ఆలయ దర్శనాలు. ఒకానొక వ్యవహారంలో మిత్రుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

తుల
మీ సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. విదేశాలు వెళ్ళాలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టినట్లయితే జయం చేకూరుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ధనవ్యయం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక అశాంతి.

వృశ్చికం
కొన్ని పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో కలహాలు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఆరోగ్యభంగం. ప్రభుత్వరంగాల్లో వారికి స్వల్ప వివాదాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార సంస్థల్లో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి.

ధనుస్సు
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రైవేటు రంగాల వారికి చికాకులు అధికం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.

మకరం
కుటుంబంలో చికాకులు. పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. విందులు, వినోదాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. బంధువుల గురించి ప్రియమైన వార్తలు వినవలసివస్తుంది.

కుంభం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని «విధంగా ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. పరస్పరం విలువైన కానుకలిచ్చి పుచ్చుకుంటారు.

మీనం
దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.

Related posts