telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు తెరాస తీర్థం పుచ్చుకోనున్న మోత్కుప‌ల్లి..

మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకొనున్నారు.తెలంగాణ భవన్‌లో మధ్యా హ్నం రెండు గంటలకు జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు మోత్కపల్లి. . ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయనున్నారు మోత్కుపల్లి. తర్వాత బషీర్ బాగ్ చౌరస్తా లోని మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ సమక్షంలో మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు మోత్కుపల్లి.

అలాగే..మోత్కుపల్లిని రాష్ట్ర దళిత బంధు చైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు దళితుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించేందుకు గాను మోత్కుపల్లిని శాసనమండలికి పంపుతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు సమాచారం.

కాగా..ఇటీవ‌ల ఈటెల‌ను బీజీపీలోకి తీసుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, తెలంగాణ బీజేపీ నేత‌లు త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని, బీజేపీలో ద‌ళితుల మ‌నోభావాల‌ను నాయ‌క‌త్వం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఈటెల బీజేపీ పార్టీకీ రాజీనామా చేశారు.

Related posts