telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కోవిడ్‌ కట్టడికి సరికొత్త యూవీ లైట్‌

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు ఈ వైరస్‌ తీవ్రత పెరుగుతూనే ఉంది. చలి కాలం రావడంతో సెకండ్ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి కట్టడికి తెలంగాణ యువకుడు మండాజి నర్సింహాచారి ఓ వినూత్న ఆవిష్కరణ చేశాడు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌కు చెందిన ఈ యువ శాస్త్రవేత్త ఫిలమెంట్‌ అవసరం లేని… అధిక తీక్షణతతో కూడిన అతినీలలోహిత కిరణాలు వెదజల్లే ఓ యంత్రం అభివృద్ధి చేశాడు. ఉపరితలంపై ఉండే కోవిడ్‌ వైరస్‌ను ఈ వినూత్న యంత్రం కేవలం 15 సెకన్లలోనే నిర్వీర్యం చేయగలగడం విశేషం. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ{సీసీఎంబీ} సైతం ఈ యూవీ బాక్స్‌ పనితీరును నిర్ధారించి, నర్సింహాచారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సరుకులు, కూరగాయలు వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని నర్సింహాచారి పేర్కొన్నారు. ఈ యూవీ పరికరం కరోనా వైరస్‌నే కాకుండా ఇతర సూక్ష్మజీవులనూ అంతం చేస్తుందని ఆయన తెలిపారు.

Related posts