telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సూర్యాపేటలో ప్రేమకోసం ప్రాణం వదిలిన జంట…

గతంలో జరిగిన చాలా బాధాకరమైన ఘటనల్లో ఒకటి మాదిరిగానే మరో ఘటన జరిగింది. పెద్దలు పెళ్ళికి అంగీకరించలేదని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.  సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో ఈ సంఘటన జరిగింది.  వివరాల్లోకి వెళ్తే, చివ్వేంల మండలం, చందుపట్ల గ్రామానికి చెందిన నవీన్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.  ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.  కానీ, వీరి వివాహానికి ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు.  దీంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి మొద్దుల చెరువు గ్రామంలోని శివారు ప్రాంతానికి  చేరుకొని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.  ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

Related posts