telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు… “V” టీజర్

V

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘వి’.. సినిమా సినిమాకు జోనర్ మారుస్తూ హిట్‌ అందుకుంటున్న ఇంద్రగంటి.. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘వి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని నటిస్తున్న 25వ సినిమా ఇది. సోమవారం సాయంత్రం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.‘ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్.. అప్పుడప్పుడూ నాలాంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటాడంతే’ అంటూ సుధీర్ చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ‘వి’ టీజర్ ఆసక్తికరంగా సాగింది. మర్డర్లు చేస్తూ దొరక్కుండా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే సైకోగా నాని, అతడిని పట్టుకునే పోలీసాఫీసర్‌గా సుధీర్ బాబు కనిపించారు.నానితో నివేదా.. ‘యువర్ సైకో.. యు నో థట్’ అంటే.. నాని ‘అమ్మో.. నిజమా.. భయమేస్తుంది’.. ‘న్యాయాన్నీ, ధర్మాన్నీ కాపాడ్డానికీ నువ్వొస్తున్నావనగానే విజిల్స్ వేయడానికి నేనేం నీ ఫ్యాన్‌ని కాదురా.. ‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’ వంటి డైలాగులు బాగున్నాయి. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా టీజర్లో చూపించారు.నివేదా థామస్, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల కాబోతోంది.మీరు కూడా ట్రైలర్ ను వీక్షించండి.

Related posts