గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించిన తాజా చిత్రం “జెర్సీ”. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల అయింది. ఈ చిత్రానికి అశేష ప్రేక్షకాదరణ లభించింది. నాని క్రికెటర్‌గా అదరగొట్టాడని సెలెబ్రిటీలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. జెర్సీ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషించాడు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్‌లో రీమేక్ చేస్తునారు. తమిళం విషయానికి వస్తే విష్ణు విశాల్ ఈ చిత్ర రీమేక్‌లో నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. తెలుగులో శ్రద్ధాశ్రీనాథ్ చేసిన పాత్రలో అమలాపాల్ నటించనుందని కోలీవుడ్‌లో వార్తలు వినపడుతున్నాయి. ఒకవేళ ఆమె నటిస్తే విష్ణు విశాల్, అమలాపాల్ కలిసి నటించే రెండో చిత్రమిదే అవుతుంది. ఇది వరకు వీరిద్దరూ `రాక్షసన్` సినిమాలో జంటగా నటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
previous post
next post