మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ డ్రామా ‘లూసిఫర్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టైటిల్, ప్రీ, లుక్ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజాగా నయన్ పుట్టినరోజు సందర్భంగా ‘గాడ్‌ఫాదర్’ చిత్రబృందం ఆమెకు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఒరిజినల్లో మంజూ వారియర్ చేసిన పాత్రనే తెలుగులో నయన పోషిస్తోంది. ఈ చిత్రంలో ఈమెకు రెండోభర్తగా యువనటుడు సత్యదేవ్ కనిపించనున్నారు.
తమిళస్టార్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ను ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే హాలీవుడ్ పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘గాడ్ ఫాదర్’లో మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పాట పాడనున్నట్లు సమాచారం.వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా థియేటర్లలోకి విడుదలకు సన్నహాలు చేస్తున్నారు.