telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాస్‌హౌజ్‌లో కొత్త కెప్టెన్ గా సోహెల్

sohile

బిగ్‌బాస్‌హౌజ్‌లో కెప్టెన్సీ కోసం జరిగిన హోటల్ హంగామా ఎట్టకేలకు ముగిసింది. 31వరోజు గెస్ట్ టీమ్ గెలిచినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. ఇక ఆ తర్వాత గెలిచిన గెస్ట్‌ టీమ్‌లో బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఎవరో ఒకరు తేల్చుకోవాలని చెప్పి వాళ్లలో వాళ్లకు గొడవ పెట్టాడు బిగ్‌బాస్. ఎవరికి వారు తామే పోటీలో నిలుస్తామనడంతో డ్రామా పండింది. అయితే మెహబూబ్‌కు నచ్చజెప్పిన సోహెల్ కెప్టెన్సీ కంటెస్టెంట్‌గా నిలిచాడు. అటు సీక్రెట్ టాస్క్‌ చేసిన అవినాష్, టిప్స్ ఎక్కువగా పొందిన అఖిల్ కూడా కెప్టెన్సీ కంటెస్టెంట్స్ అయ్యారు. కెప్టెన్సీ పోటీతో కింద మంట పెట్టాడు బిగ్‌బాస్. అఖిల్, అవినాష్, సోహెల్‌ కు మంచు, నిప్పు మధ్యలో ఓర్పు టాస్క్ ఇచ్చాడు. కానీ మెహబూబ్‌ త్యాగాన్ని గుర్తుపెట్టుకున్న సోహెల్ కెప్టెన్సీ గెలిచాడు.

Related posts