telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇస్మార్ట్ టీంతో కరణ్ జోహార్…?

Puri

ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయంతో ఫుల్‌ జోష్‌మీదున్న పూరీ జగన్నాథ్ విజయ్‌దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరీ, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ ప్రాజెక్టుతో భాగస్వామ్యం కానున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఛార్మీ అండ్ టీం ముంబైకి వెళ్లి ఫైటర్ సినిమాతో పనిచేసే విషయమై కరణ్‌జోహార్ తో చర్చించగా… కరణ్ జోహార్ అందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఫైటర్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. అర్జున్ రెడ్డితో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ కొట్టేసిన విజయ్‌దేవరకొండ ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లేనని స్పష్టమవుతోంది.

Related posts