telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పర్యాటకంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయం…

టీఎస్-ఐపాస్ విధానానికి తెలంగాణ పర్యాటక శాఖ సేవలు అనుసంధానం పై హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎస్-ఐపాస్ వెబ్ పోర్టల్ ద్వారా పర్యాటక శాఖ సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… పర్యాటకం లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమన్నారు. మలేషియా, సింగపూర్ లాంటి తదితర చాలా దేశాలు పర్యాటకం మీద వచ్చే ఆదాయం పై నే అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. తెలంగాణకు పర్యాటక అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని.. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. హోటల్ కట్టాలంటే 15 రకాల అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని.. 30 రోజులలో అనుమతులు ఇవ్వనున్నామన్నారు. రెన్యువల్ కూడా ఆటోమాటిక్ గా జరుగుతుందని పేర్కొన్నారు. . అనుమతి ఇవ్వని పక్షంలో 30 రోజుల తర్వాత డీమ్డ్ అప్రూవల్ వస్తుందని.. భవిష్యత్లో తెలంగాణలో టూరిజం మంచి అభివృద్ధి చెందుతుందన్నారని తెలిపారు. తెలంగాణ కు ఘనమైన చరిత్ర ఉందని.. రామప్ప లాంటి వరల్డ్ టూరిజం మ్యాప్ లోకి త్వరలోనే చేరుతున్నాయని తెలిపారు. భారతదేశంలో తెలంగాణ అభివృద్ధి లో అగ్రభాగాన నిలుస్తోందన్నారు.

Related posts