ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి, ఛార్మి నిర్మాతలు. ఇటీవలే “ఇస్మార్ట్ శంకర్” విడుదల తేదీ వాయిదా పడింది. జూలై 12 నుంచి 18కి వాయిదా వేశారు. 12న వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతోనే నిర్మాతలు చార్మీ, పూరీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమా విషయానికొస్తే టాకీ పార్ట్ పూర్తి, పాటలు, ప్యాచ్ వర్క్ చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా పూరీ జగన్నాథ్ మైఖేల్ జాక్సన్ అభిమానులకు ఓ ఆఫర్ ఇచ్చాడు. పాప్ సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టించిన రాక్ స్టార్ మైఖేల్ జాక్సన్. జాక్సన్ 25 జూన్, 2009న కన్నుమూశారు. ఆయన ఈ లోకాన్ని వీడి నిన్నటితో పది సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మైఖేల్‌కి బిగ్ ఫ్యాన్ అయిన పూరీ తన ట్విట్టర్‌లో జాక్సన్ అభిమానులకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మైఖేల్‌కి తాను వీరాభిమానిని అని చెబుతూ ..మైఖేల్ జాక్సన్ వర్థంతి సందర్భంగా ఆయన అభిమానులందరినీ ట్విట్టర్ లో ఫాలో అవుతానని ప్రకటించారు పూరీ. అయితే నెటిజన్స్ చేయాల్సిన పని ఏమిటంటే తన ట్వీట్ ను రీట్వీట్ చేయడమేనని వెల్లడించారు. తన పోస్టును రీట్వీట్ చేసిన వారిని తప్పకుండా ఫాలో అవుతానని తన ట్వీట్ లో తెలిపారు.