“ఫలక్‌నుమాదాస్” సినిమా హీరో విశ్వక్ సేన్.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడంటూ దుమారం రేగింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో హీరో విశ్వక్ పోస్ట్ చేసిన వీడియోలో, విజయవాడ ప్రెస్‌మీట్‌లో హీరో విశ్వక్ సేన్ విజయ్‌దేవరకొండ ఫ్యాన్స్‌ను, రివ్యూ రైటర్స్‌ను దూషించాడని, కొందరిని టార్గెట్ చేస్తూ వివాదస్పదంగా మాట్లాడాడు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ “మీడియా ముందు, లైవ్‌లో, ఇంటర్వ్యూలో అయినా నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడుతాను. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1500 ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెడితే.. పెట్టిన నలభై సెకన్స్‌లో చివరి ఆరు సెకన్స్ వదిలేసి, అసలు వీడు ఎవడ్ని అన్నాడు? అనే డైలామా క్రియేట్ అయ్యింది. ఎవడ్ని అన్నాననే బ్లాంక్ నింపి, కొంత మంది నిన్ను అన్నాడు.. కాదు నిన్ను అన్నాడంటూ పబ్లిసిటీ చేశారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు.. పెద్ద జోక్ కూడా. నేను ఏ రివ్యూ రైటర్‌నికానీ.. మీడియాను కానీ.. ఏ హీరోను కూడా ఏమీ అనలేదు. నా సినిమాపై కొందరు నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఈ పనిని వారు కావాలనే చేస్తున్నారు. నా సినిమాకు పదికోట్లు నష్టం వస్తుందని తెలిసినప్పుడు కంట్రోల్ తప్పి, ఒక మాట అన్నాను. దానికి నా తరపు నుండి వెరీ వెరీ సారీ. మూడు రోజులుగా నిద్రలేకుండా కష్టపడుతున్నాం. అలాంటి సందర్భంలో సినిమా బాగోలేదంటే నాకు సుర్రుమని కోపం వచ్చింది” అని తెలిపాడు.
previous post
next post