telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. ఇక ట్రాఫిక్ సమస్యకు చెక్

హైదరాబాద్‌ ప్రజలకు మరో శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేయర్, డిప్యూటీ మేయర్లు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు 66.59 కోట్ల వ్యయంతో పూర్తయింది. ఈ ప్రాజెక్టు కారణంగా హైటెక్ సిటీ, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. దాదాపు 410 మీటర్ల పొడవు, 20 .60 మీటర్ల వెదర్ల్పు కలిగిన ఈ ఆర్.యూ.బి ప్రారంభంతో ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ కలిగిన హై-టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే స్టేషన్ మార్గంలో ఏవిధమైన అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ఎస్.ఆర్.డి.పి మొదటి దశలో గచ్చిబౌలి నుండి జె.ఎన్ టి,యు వరకు చేపట్టిన ఫ్లయ్ ఓవర్లు, అండర్ పాస్ లైన బయో డైవర్సిటీ, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ జుంక్షన్స్ ప్రాజెక్టులు ప్రారంభం కావడంతో వీటి ఫలాలను నగరవాసులు ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేస్తూ ఫలితాలను పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో హై -టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం కావడం ఈ ప్రాంత వాసులకు మరింత వెసులుబాటు అయింది. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ ఆర్.యు.బి నిర్మాణంతో తీరుతున్నందుకు స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts