telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహీల్స్ బాలిక రేప్ కేసులో వెలుగులోకి కీల‌క అంశాలు..

*జూబ్లీహీల్స్ బాలిక రేప్ కేసులో వెలుగులోకి కీల‌క అంశాలు..
*నిందితులంతా రాజ‌కీయ నాయ‌కుల కొడుకులుగా గుర్తింపు
*ఇప్ప‌టికే ముగ్గురు నిందితులు అరెస్ట్‌..
*అరెస్ట్‌చేసిన ఇద్ద‌రు మైన‌ర్ల‌కు జువైన‌ల్ హోం త‌ర‌లింపు
*మ‌రో ఇద్ద‌రు కోసం గాలింపు..

జూబ్లీహిల్స్​లో బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయి.

బాలికపై రేప్‌కి పాల్పడిన ఇన్నోవా కారు నెంబర్ టీఎస్09ఎఫ్‌హెచ్3786 (TS09FH3786)గా పోలీసులు గుర్తించారు. బాలికపై అత్యాచారం అనంతరం కారులో మొయినాబాద్​కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్​లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. ఆ ఫాంహౌస్​ నుంచే నిందితులు వేర్వేరు చోట్లకు పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది.

For Hyderabad Gang-Rape, Arrests Include Son Of Leader From KCR's Party - Masterji Tips

ఫాంహౌస్​ వెనక కారును దాచిన నిందితులు.. అక్కడే కారుకు ఉన్న ప్రభుత్వ వాహన స్టిక్కర్​ను తొలగించారని తెలుస్తోంది. నిందితులు కారులో లైంగిక దాడికి సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. 

నిందితులు వీరే.. 

A1.. సాదుద్దీన్‌(ఎంఐఎం నేత కొడుకు)
A2.. ఉమేర్‌ఖాన్‌(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు)
మైనర్‌-1.. వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కొడుకు
మైనర్‌-2.. ఎంఐఎం కార్పొరేటర్‌ కొడుకు
మైనర్‌-3.. సంగారెడ్డి మున్సిపల్‌ కో-ఆప్షన్‌ మెంబర్‌ కొడుకు ఉన్నారు.

ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో అమ్నీషియా పబ్‌ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్‌ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్‌ ఉన్నారు. ఇద్ద‌రు మైన‌ర్ల‌కు జువైన‌ల్ హోం త‌ర‌లించారు.కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు. 

Related posts