telugu navyamedia
క్రీడలు వార్తలు

టీం ఇండియా సెలక్షన్‌ ప్యానెల్ ఛైర్మన్‌గా చేతన్‌ శర్మ…

భారత మాజీ పేసర్ చేతన్‌ శర్మ భారత జట్టు సెలక్షన్‌ ప్యానెల్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. ఐదుగురు సభ్యులు ఉన్న జట్టులో అబే కురువిల్లా, దేవాశిష్‌ మెహంతిలను కూడా చేర్చింది బీసీసీఐ. సెలక్షన్ ప్యాన్‌లో టీమిండియా మాజీ ప్లేయర్లు సునీల్ జోషి, హర్విందర్‌సింగ్‌ కూడా ఉన్నారు. భారత్‌ తరపున 23 టెస్టులు, 65 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు చేతన్‌ శర్మ. 11 ఏళ్లపాటు సాగిన అంతర్జాతీయ కెరియర్‌లో 1987 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ ఒక చెరగని గుర్తు. చేతన్ శర్మ 16 ఏళ్ల వయసులోనే హర్యానా తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 18 ఏళ్ల వయసులోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అంతకంటే ఏడాది ముందే 1983లో విండీస్‌తో వన్డే కూడా ఆడాడు చేతన్ శర్మ. ఇప్పటి వరకు సెలక్షన్ ప్యాన్‌ ఛైర్మన్‌గా జోషి వ్యవహరించారు. నిబందనల ప్రకారం ఐదుగురిలో ఎక్కువ టెస్టులు ఆడిన చేతన్‌ శర్మ ఇకపై చీఫ్‌ సెలక్టర్‌ హోదాలో వ్యవహరిస్తారు. వెస్ట్‌ జోన్‌నుంచి చివరి నిమిషం వరకు అజిత్‌ అగార్కర్‌ పేరు వినిపించినా… అనూహ్యంగా కురువిల్లాకు అవకాశం లభించింది. వీరితో పాటు సెలక్టర్‌ పదవి కోసం మణీందర్‌ సింగ్, నయన్‌ మోంగియా, శివసుందర్‌ దాస్, రణదేబ్‌ బోస్‌ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం సెలక్షన్‌ కమిటీలో ఉన్న ఐదుగురూ బౌలర్లే కాఈవడం గమనార్హం.

Related posts