telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వి.హెచ్ వ్యాఖ్యలను ఖండిస్తున్న : మల్లు రవి

congress flags

నా పైనా కొంత మంది నాయకులపైన వి.హెచ్ వ్యాఖ్యలను ఖండిస్తున్న… నేను చెంచాగిరి చేస్తున్నట్టు చేసిన ఆరోపణలను ఖండిస్తున్న.. ఎవరికి చెంచాగిరి చేయాల్సిన అవసరం నాకు లేదు అని మాజీ.ఎం.పి & టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి అన్నారు.  నేను  వైద్య వైద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. 165 మంది నాయకులతో పాటు నా అభిప్రాయాన్ని కూడా అధిష్టానం తీసుకుంది.   రేవంత్ రెడ్డి పీసీసీ ఇవ్వాలని నేను బహిరంగంగానే మీడియాకు చెప్పాను. ఇందులో చెంచాగిరి ఏముంది. రేవంత్ రెడ్డి మా ప్రాంత వాసుడు, ఎంపీ, వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నాడు. ఆయన పీసీసీ అధ్యక్షులు కావాలని నేను అభిప్రాయం వ్యక్తం చేసా.. ఎవరు ఎవరి పేరు చెపితే వాళ్ళు వారికి చెంచాగిరి చేసినట్టా.. ఇదేం మాటలు. ఏఐసీసీ దూతగా వచ్చిన ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ పైన ఆరోపణలు చేస్తే అది అధిష్టానం పైన చేసినట్టే.. గతంలో ఎన్నడూ లేని విదంగా 165 మంది అన్ని స్తాయిలల్లోని నాయకులను ఏఐసీసీ ఇంఛార్జీలు 4 రోజులపాటు సుదీర్ఘంగా అభిప్రాయ సేకరణ చేశారు. తర్వాత ఏఐసీసీ కార్యదర్శులు మరింత మంది ముక్యులతో మరో దఫా చర్చలు జరిపారు.  ఇంత లోతుగా సమీక్ష చేసి అన్ని వర్గాల నాయకుల అభిప్రయాలతో మనిక్కమ్ ఠాగూర్, కేసీ వేణుగోపాల్ గారు సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు.  ఇంత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నడూ చర్చలు జరగలేదు. మనిక్కమ్ ఠాగూర్ ను అంటే అధిష్టానంని అన్నట్టే… క్రమశిక్షణ గల నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలి. గతంలో జరిగిన అనేక కీలక నిర్ణయాలలో కూడా సీఎం, సీఎల్పీ, పీసీసీ నియామకాల విషయంలో అందరూ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పని చేసారు.. నివేదికలో ఏముందో అధిష్టానానికి తప్ప ఎవరికి తెలియదు, పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా ఆరోపణలు చేయడం తగదు. క్రమశిక్షణా ఉల్లంఘించి మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలము.. కానీ అధిష్టాన నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే నాయకులం కాబట్టి మేము మాట్లాడలేము. ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితులలో ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇస్తే బాగుంటుందో పార్టీ అధిష్టాననికి తెలుసు. పార్టీ బాగుపడాలని, తిరిగి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఆశయ సాధన లక్ష్యం నెరవేరాలని కోరుకునే వాళ్ళం..  అధిష్టానం కూడా అలాగే ఆలోచిస్తుంది. క్రమశిక్షణ గల నాయకులు అధిష్టాన నిర్ణయాలను పాటించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.

Related posts