మనకు మొదట కార్ టాక్సీలు వచ్చాయి. ఆ తర్వాత ఆటో ఈ మధ్యనే బైక్ టాక్సీలు కూడా వచ్చాయి. కానీ ఈ కొత్త తరహా టాక్సీలు భారత్ లో మొదటిసారిగా ధెషణం ఇచ్చాయి. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి… రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్, సైన్యం.. వరదల్లో చిక్కుకున్నవారిని బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. ఇదే సమయంలో… దేశంలోనే మొదటిసారిగా వాటర్ టాక్సీ సర్వీసులను కేరళ రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించింది. ప్రయాణికుల రవాణాకు సంబంధించి అలప్పుజ బ్యాక్ వాటర్స్‌లో ఈ వాటర్ టాక్సీలను ప్రారంభించింది. కాటమరాన్ డీజిల్ శక్తితో పనిచేసే ఈ టాక్సీల్లో, 10 మంది ప్రయాణీకులు ఒకేసారి ప్రయాణించొచ్చు. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఎలక్ర్టిక్ పవర్ స్టీరింగ్, సోలార్ ప్యానెల్ అమరికతో అన్ని విద్యుత్ అవసరాలను తీర్చేలా ఉన్న ఈ ట్యాక్సీల్లో ఎక్కడికైనా చేరుకోవచ్చు. కాగా, కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పడవలు ఉపయోగిస్తుంటారు.. ఇక, సముద్రం చేరువగా ఉన్న కేరళలో టూరిజం భాగా అభివృద్ధిచేశారు.. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు.. విదేశాల నుంచి సైతం పర్యాటకులు తరలివస్తుంటారు.. టూరిజనానికి కొత్త ట్యాక్సీలు మరింత దోహదపడతాయని అంచనావేస్తున్నారు. అయితే ఈ వర్షాలు ఇలానే ఉంటె మిగిత రాష్ట్రకి కూడా ఈ టాక్సీలను ప్రారంభించవచ్చు.
previous post