telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : బిగ్ బాస్ ఆదేశాలు బేఖాత‌రు… ఫైర్ అయిన పునర్నవి

punarnavi targeted this week in bigg boss 3

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 ఆదివారం ఎపిసోడ్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా 50 రోజులు (ఏడు వారాలు) పూర్తి చేసుకుంది. ఈ వారం శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, శ్రీముఖి ల‌లో ఒక‌రు ఇంటి నుండి వెళ్ళ‌నున్నారు. ఎపిసోడ్ 52లో ఇంటి స‌భ్యుల‌కి ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో కొంద‌రు దెయ్యాలుగా ఉంటే ఇంకొంద‌రు మ‌నుషులుగా గేమ్‌లో పాల్గొన్నారు. అయితే టాస్క్‌లో భాగంగా దెయ్యంగా ఉన్న శిల్పా చ‌క్ర‌వ‌ర్తి మ‌నిషిగా ఉన్న పున‌ర్న‌విని తీసుకొచ్చి స్విమ్మింగ్ ఫూల్‌లో పడేసింది. దీన్ని తప్పుపడుతూ.. ఇలాంటి బుల్ షిట్ గేమ్‌లు ఇవ్వొద్దు అంటూ బిగ్ బాస్‌పై మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో నిప్పులు చెరిగింది పునర్న‌వి. బుధ‌వారం ఎపిసోడ్‌లోను త‌న ఆవేశాన్ని చూపిస్తూ రెచ్చిపోయింది పున్నూ. వాళ్ళ ఏం చేసిన నోరు మెద‌పకూడ‌దు అంటే అదేమి టాస్క్‌. ఇలాంటి ముష్టి టాస్క్‌లు మాకు ఇవ్వొద్దు. ఇలాంటి గేమ్స్ మీరే ఆడుకోండి. బిగ్ బాస్ అనే వాడు ఎప్పుడు క‌రెక్ట్ కాదు. మేం వంద శాతం ఎఫ‌ర్ట్ పెడితే స‌డెన్‌గా ర‌ద్దు చేస్తారు. ఎమోష‌న‌ల్ డ్రైన్ చేయడం కరెక్ట్ కాదు. కొంచెం సెన్స్ ఉన్న టాస్క్‌లు ఇవ్వండి. నా రియాక్షన్ తప్పైతే బయటకు పోతా. టాస్క్ అన్నప్పుడు క్లియర్‌గా ఇవ్వాలి. క్లారిటీ ఉండాలి.. సిల్లీ గేమ్స్ ఇవ్వకు’ అంటూ బిగ్ బాస్‌ని ఏకి పారేసింది పున‌ర్న‌వి.

మంగ‌ళవారం రోజు దెయ్యాలుగా ఉన్న‌వారంద‌రు వారి టాస్క్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయ‌డంతో, దెయ్యాలు మ‌నుషులుగా, మ‌నుషులు దెయ్యాలుగా మారారు. బుధ‌వారం ఎపిసోడ్‌లో దెయ్యాలుగా శ్రీముఖి, పున‌ర్న‌వి, మ‌హేష్‌, వ‌రుణ్ సందేశ్, ర‌వికృష్ణ‌ ఉండ‌గా, వారు టాస్క్‌ని మేం చేయ‌లేమ‌ని బిగ్ బాస్‌కి తేల్చి చెప్పారు. టాస్క్ నియ‌మాల‌ని స‌రిగ్గా పాటించని శ్రీముఖి, పున‌ర్న‌వి, మ‌హేష్‌ల‌కి బిగ్ బాస్ ప‌నిష్మెంట్ ఇచ్చారు. మోస్ట్ వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా వారి ముగ్గురిని ప్ర‌క‌టిస్తూ శ్రీముఖి, పునర్నవి, మహేష్‌లకు షూ పాలిష్ శిక్ష విధించారు. గార్డెన్ ఏరియాలో ఉన్న షూస్‌తో పాటు ఇంటి స‌భ్యుల షూస్‌ని కూడా ముగ్గురు పాలిష్ చేయాల‌ని బిగ్ బాస్ ఆదేశించ‌గా, శ్రీముఖి ఆ ప‌ని చేసేందుకు ముందుకు వ‌చ్చింది. కాని పున‌ర్న‌వి, మ‌హేష్‌లు ఇలాంటి ప‌నులు మేం చేయ‌డానికి ఇక్క‌డ‌కి రాలేదంటూ మోండికేసి కూర్చున్నారు. మిగ‌తా ఇంటిస‌భ్యులు వీరిద్ద‌రిని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేసిన ఓ మెట్టు కూడా దిగి రాలేదు. చివ‌ర‌లో మ‌హేష్ కొంత కాంప్ర‌మైజ్ అయి టాస్క్ లో పాల్గొన్నాడు. పున‌ర్నవి మాత్రం నేను బ‌య‌ట‌కి అయిన పోతా క‌ని ఇలాంటి చీప్ టాస్క్‌లు చేయ‌నంటూ బిగ్ బాస్ ఆదేశాల‌ని బేఖాత‌రు చేసింది. అయితే శిక్ష పాటించ‌క‌పోతే వ‌చ్చే వారం డైరెక్ట్‌గా నామినేట్ అవుతావు అని బిగ్ బాస్ చెప్పిన తాను చేయ‌న‌ని మొండికేసింది. అలీ చేసిన‌ప్పుడు అంత‌గా త‌ప్పు ప‌ట్టిన ఆమె ఇప్పుడు త‌న వ‌ర‌కు వ‌చ్చే స‌రికి చాలా తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తుంది. పున‌ర్న‌విది గేమ్ కానే కాదు అంటూ నెటిజ‌న్స్ ఆమెపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

Related posts