telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఇవి తింటే ఎలాంటి కిడ్నీ సమస్యలైనా మటాష్..

tips for healthy kidneys

చాలామంది మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారికి.. మూలికలు సంజీవని మంత్రంలా పనిచేస్తాయని . ఇందులో తేలిన విషయమేంటంటే, ‘పునర్నవ’ అనే మూలిక మూత్రపిండాల వ్యాధులను అదుపులోకి వత్తునది. మూలికలతో తయారు చేసిన నీరి కేఎఫ్‌టీ’ ద్రావణం వాడితే సమస్యలు తగ్గినట్లు.. పునర్నవ తో తయారుచేసిన ద్రావాణాన్ని నెలపాటు వాడిన మహిళలో క్రియాటినైన్, యూరియా స్థాయిలు సాధారణస్థితికి వచ్చినట్లు నిర్ధారించారు. రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం కూడా పెరిగింది. ఇంకా ప్రయోగాలు జరుగుతున్న ఈ పరిశోధన సక్సెస్ అయితే.. కిడ్నీ పేషెంట్స్‌కి సరికొత్త మందు అందుబాటులోకి వస్తుంది.

#కిడ్నీలో_రాళ్లు&నొప్పి తగ్గాలి పోవాలి అంటే ఈ సలహాలు పాటిస్తే కరిగిపోతాయంతే…

1. కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు ఎక్కువుగా నీటిని త్రాగుతూ ఉండాలి. రోజుకి సుమారు 7 నుంచి 10 లీటర్ల నీటిని, ద్రవ పదార్ధాలను తీసుకుంటూ ఉండాలి.

2. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయానే త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.

3. అరటిచెట్టు బెరడును జ్యూస్‌లా చేసి తీసుకోవటం వల్ల కిడ్నీల్లో రాళ్లు మూత్రవిసర్జనతో పాటు బయటకు వస్తాయి.

4. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు చాక్లెట్లు, పాలకూర, సోయా, ఎండుచిక్కుడు, టమోటా వంటి ఆక్సలేట్ పదార్థాలు తినకూడదు.

5. క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. అందువల్ల అలాంటి ఆహార పదార్ధాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.

6. కొత్తిమీర ఆకుల్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.

7. గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి రోజూ త్రాగటం వల్ల మంచి ఉపశమ ఉంటది

#యూరిన్_సమస్యకు
ఈ మూడు సమస్యలకూ ఆయుర్వేదంలో అనేక ఔషధాలను, మూలికలను సూచించారు మన ఋషులు. వీటి పరిష్కారంలో చాలాబాగా పనిచేసే ఔషధాలు ప్రధానంగా మూడు:

1. పల్లేరు కాయలు
2. కొండపిండి ఆకు
3. గలిజేరు (గంజరాకు మొక్క)

#మూత్రసమస్యలుఉన్నవాళ్ళు
1. చారెడు పల్లేరు కాయలు(ముళ్ళు),
2. చిన్న చిన్న ముక్కలుగా చేసిన కొండపిండి చెట్ట్లు (పూతతో సహా) ఒక గుప్పెడు,
3. గలిజేరు చెట్లు (చిన్న చిన్న ముక్కలుగా కోసినవి, వ్రేళ్లతో సహా)ఒక గుప్పెడు-

మూడింటినీ కలిపి ఒక గిన్నెలో వేసి ఒక పెద్ద గ్లాసెడు నీళ్ళు పోసి సన్న మంటమీద మరిగించాలి. ఆ గ్లాసెడు నీళ్ళూ పావు గ్లాసెడు అయ్యేంతవరకూ మరిగేసరికి, ఔషధాల్లోని సారం పూర్తిగా నీళ్లలోకి చేరుకుంటుంది. ఇలా తయారైన ద్రవాన్ని ‘కషాయం’ అంటారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఈ కషాయాన్ని ఖాళీకడుపున త్రాగటం అవసరం.

సమస్య తీవ్రతనుబట్టి- ముఖ్యంగా అశ్మరిలో- పల్లేరు ముళ్ళు కొన్ని (ఒక గుప్పెడు) వేసి, మరిగించి చల్లార్చిన నీళ్ళను రోజంతా, ఎప్పుడు దాహం అయితే అప్పుడు త్రాగేందుకు వాడుకోవలసి వస్తుంది.

అశ్మరిలో నడుము నొప్పి అధికంగా ఉన్నట్లయితే తైలం (నువ్వులనూనె)గాని, వైద్యులు సూచించే ఇతర ప్రత్యేకమైన ఔషధ తైలాలుగాని పొత్తి కడుపు/నడుముకు రాసుకొని, ఒక గంట తర్వాత స్నానం చేయటం ఉపశమనాన్నిస్తుంది.

సమస్య మరీ అధికంగా ఉన్న సందర్భాలలో వైద్యులు ఔషధ తైలాలను నడుముకు, పొత్తికడుపుకూ పట్టించి ప్రత్యేకమైన ఆకులతో కట్టిన మూటలతో కాపడం పెట్టిస్తారు. వీటికి అదనంగా వైద్యులు వారి వారి యుక్తిననుసరించి పలురకాల మాత్రలనూ సూచిస్తారు.

#ఆహారంలో_తీసుకోకూడనివి(మూడు నెలలు తప్పక డైట్ చేయాలి )

*పెరుగు
*టమాట
*క్యాబేజీ
*పాలు, పాల పదార్థాలు
*మసాలా, కారం అధికంగా ఉండే పదార్థాలు
*నూనె/పిండి వంటలు

#ఆహారంలోఅధికంగాతీసుకోవలసినవి(ప్రతి రోజు )

*చిలికి వెన్న తీసిన మజ్జిగ
*ఎక్కువమొత్తంలో నీళ్ళు
*జొన్నలు
*పెసలు
*బార్లీ
*రాగులు
*గలిజేరు
*కొండ పిండి ఆకు

Related posts