telugu navyamedia
సినిమా వార్తలు

బికీనీలో ప్రియాంక..

గ్ల్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఏం చేసినా చిటికెలో వైరల్ అవుతుంది. తాజాగా ప్రియాంకా చోప్రా షేర్ చేసిన పిక్ లో హాట్ ఫొటోలతో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఎప్పుడూ షూటింగుల్లో బిజీగా ఉండే ఆమెకు ఇదో ఆటవిడుపు. తన భర్త నిక్ జోసెఫ్ తో కలిపి ఏదో ఒక ట్రిప్ వేస్తుంటుంది.

తాజాగా ప్రియాంక నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘సైటడెల్‌’ కోసం లండన్‌ చేరుకున్నారు.అక్కడ విరామం సమయంలో బీచ్‌లో హాయిగా సేద తీరుతున్నారు. సోమవారం ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు యువత హృదయాల్లో హీట్‌ను పెంచుతున్నాయి.

బీచ్‌లో బికినీ ధరించి ఇసుకలో దొర్లుతూ టూ హాట్‌గా ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చిన ప్రియాంక.. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘పర్ఫెక్ట్‌ సండే.. స్నాక్స్‌’ అని రాసుకొచ్చారు. చాకు, ఫోక్‌ ఈమోజీలను జత చేశారు. నిక్‌జోనస్‌ ఆమె హిప్‌పై చాక్‌తో స్నాక్‌ పీసెస్‌ కట్‌ చేస్తున్నట్లుగా ఫొటో స్టిల్‌ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రియాంక సోదరి.. పరిణీతి చోప్రా ‘ఏం జరుగుతోంది’ అంటూ ఆ ఫొటలకు కామెంట్‌ చేశారు. తమకు కూడా కావాలంటూ కొంద‌రు నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఎది ఏమైనా నెటిజన్లకు మాత్రం హాట్ విందు అందింది.

 

Related posts