telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్ లో దారుణం.. కన్నకూతురిపై కన్నేసిన కామాంధుడు..

హైదరాబాద్ లో అమ్మాయిల పై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం ఎంత కఠిన మైన చర్యలు తీసుకుంటున్న కూడా కామాంధులు దాడులు చేస్తున్నారు. వావి వరుసలు పూర్తిగా మరచి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. కన్న తండ్రే చిన్నారి పై కాలయుముడుగా మారాడు.ఈ నీచపు ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది..నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తొలి భార్యతో మనస్పర్ధలు వచ్చి కొన్నేళ్ల కిందట మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు 17 ఏళ్ల కూతురు ఉంది. ఆ యువతిని తానే చూసుకుంటానని అతను అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు తన వక్ర బుద్దిని బయట పెట్టాడు.బాలికపై కన్నేసిన నిందితుడు కొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో ఆ అమ్మాయి తన సమీప బంధువుల వద్ద గోడు వెళ్లబోసుకొని విలపించింది.కామవాంఛతో రగిలిపోతున్న నిందితుడు భర్త పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది..

Related posts