telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సౌత్‌ వాళ్లకు ఎప్పుడూ అదే వ్యామోహం..పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

Pooja

పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌. వరుస సినిమాలతో పూజా దూసుకెళుతోంది. పూజాకు ఇంతా క్రెజ్‌ రావడానికి కారణం తెలుగు చిత్రపరిశ్రమ. అయితే..తాజాగా ఆమె తెలుగు చిత్రపరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారని, మిడ్‌ డ్రెస్‌లలోనే హీరోయిన్లను చూడాలనుకుంటారని ఓ ఇంటర్వ్యూలో పూజ పేర్కొన్నారు. హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. దక్షిణాది సినిమాల వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ ఇలా మాట్లాడటం కరెక్ట్‌ కాదని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. దక్షిణాదిని కించపరిచే బదులు ఎక్స్‌ఫోజింగ్‌ పాత్రలు చేయకుండా ఉండాలని పూజాకు సలహాలు ఇస్తున్నారు. తెలుగు ఆడియన్స్‌ స్టార్‌ హీరోయిన్‌ హోదా ఇచ్చినందుకు వాళ్లకు పూజ తగిన గుణపాఠం చెప్పారని..అక్కడితో ఆగకుండా ఇక తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోమ్మని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. దీనిపై పూజా హెగ్డే ఇంకా స్పందించలేదు. ఆమె ఎలా స్పందిస్తుందో అందరూ ఎదురుచూస్తున్నారు.

Related posts