telugu navyamedia
సినిమా వార్తలు

నాని మీదున్న నమ్మకంతోనే వెన‌క్కి త‌గ్గ‌లేదు..

న్యాచులర్ స్టార్ నాని నటించిన సినిమా శ్యామ్ సింగ రాయ్ అద్భుతమైన ప్రేమకథ . నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్న ఈ సినిమా డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ బోయనపల్లి మీడియాతో ముచ్చటించారు.

Nani Producer Talks About The Hurdles Of Shyam Singha Roy

సినిమా చూస్తే కచ్చితంగా 1970ల కాలం నాటి కోల్‌కతాలోకి వెళ్లినట్లే అనుభూతి చెందుతారు. ఆరోజుల్లో అక్కడి కల్చర్‌ ఎలా ఉండేదో తెలుస్తుంది. అప్పటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపిస్తాం. ఇదొక విశ్వజనీనమైన సినిమా. ఈ కథకు అందరూ కనెక్ట్‌ అవుతారు. అందుకే దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. బాలీవుడ్‌లోనూ రీమేక్‌ అవుతుందన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు హిందీలో విడుదల చేయడం లేదు”.

Rise of Shyam: The first lyrical song from Nani's 'Shyam Singha Roy' to be unveiled on this date | Telugu Movie News - Times of India

“నానిపై ఉన్న నమ్మకంతోనే బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నేను ఆయన్ని నమ్మాను. ఆయన కథను, దర్శకుడ్ని నమ్మారు. అందుకే సినిమా ఇంత బాగా వచ్చింది. ఇందులో ముగ్గురు కథానాయికలు చాలా బాగా చేశారు. దర్శకుడు రాహుల్‌ మేకింగ్‌ ప్రేక్షకుల్ని తప్పకుండా థ్రిల్‌ చేస్తుంది”.

Royal Event Of Nani's Shyam Singha Roy In Warangal On December 14th!!
*నేను 12 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఎన్నో సినిమాలకు బ్యాకెండ్ పని చేశాను. శ్యామ్ సింగ రాయ్ మేకింగ్ విషయంలో మాత్రం ఏనాడూ ఒత్తిడికి గురి కాలేదు. దానికి కారణం హీరో నాని. ఆయన ఈ కథను నమ్మాడు. ముందు నేను వేరే సినిమా చేయాల్సింది. కానీ నాని గారే నన్ను ఈ సినిమా చేయమన్నారు. మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. గొప్ప సినిమా చేయాలని అందరూ అనుకుంటారు. నానికి జర్సీ ఎలాగో నాకు శ్యామ్ సింగరాయ్ అలాంటి చిత్రం.

* కరోనా వల్ల కాస్త బడ్జెట్ పెరిగింది. ఆ విషయం మాకు ముందే తెలుసు. కొన్ని సెట్స్ దెబ్బతిన్నాయి. అందుకే బడ్జెట్ పెరిగింది.

* థియేటర్స్ కౌంట్ తెలీదు కానీ మాకు కావాల్సినన్నీ థియేటర్లు ఇచ్చారు. దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

* సినిమా చూస్తే కచ్చితంగా 1970 కలకత్తాకు వెళ్తాం. అక్కడి కల్చర్ తెలుస్తుంది. మనం కచ్చితంగా 70వ దశకంలోకి వెళ్లినట్టు ఫీలవుతాం. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తాం.

* కలకత్తా బ్యాక్ డ్రాప్‌ను చూపించేందుకు భారీ సెట్స్ వేశాం. అంతేకాకుండా కలకత్తాకు 400 కి.మీ దూరంలో ఉన్న ఊర్లో షూట్ చేశాం.

* ఇది యూనివర్సల్ మూవీ. తెలుగు వాళ్లకే నచ్చే సినిమా ఏమీ కాదు. బెంగాలీలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లేదు. దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నాం. ఇది హిందీలో రీమేక్ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే హిందీలో విడుదల చేయడం లేదు. ఈ కథకు అందరూ కనెక్ట్ అవుతారు.

*ఇండస్ట్రీలో 12 ఏళ్లుగా ఉన్నాను. ఏడాది క్రితం నిర్మాతగా మారాను. ఓ మూడేళ్ల నుంచి నాని గారితో సినిమా చేయాలని ఎదురుచూస్తూ వచ్చాను. అలా నాకు ఓ స్పెషల్ మూవీ ఆయనతో చేసే అవకాశం వచ్చింది. మళ్లీ శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాను చేస్తానో కూడా తెలీదు.

* నాని గారితో సినిమా చేస్తే ఒత్తిడి అనేది ఉండదు. కృష్ణార్జున యుద్దం సినిమాలో నేను భాగస్వామిని. చేస్తే ఇలాంటి హీరోతో సినిమా చేయాలని అనుకున్నాను.

* మొదటగా నిర్మాత అవ్వాలనే ఆలోచన లేదు. కానీ కృష్ణార్జున యుద్దం చేసే సమయంలో సొంత ప్రొడక్షన్ పెట్టాలని అనుకున్నాను. అది కూడా నాని గారి సినిమాతోనే ప్రారంభించాలని రెండున్నరేళ్లుగా ఎదురుచూశాను.

Thumbnail image

* మంచి సినిమా తీయాలనే కోరిక నిర్మాతలందరికీ ఉంటుంది. నేను నాని గారితో మంచి సినిమా తీయాలని అనుకున్నాను. ఈ సినిమా నేను తీసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. రేపు సినిమా విడుదలైతే అందరూ బాగుందని అంటారు. నిహారిక అంటే శ్యామ్ సింగ రాయ్ అని అంటారు.

* నాని గారి మీదున్న నమ్మకంతోనే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఆయన కథను నమ్మారు. ఆయన్ను నేను నమ్మాను. నాని గారు డైరెక్టర్‌ను నమ్మారు..

* నా దృష్టిలో నిర్మాతకు హీరో, దర్శకులంటే ప్రేమ ఉండాలి. వారిపై నమ్మకం ఉండాలి. అలాంటప్పుడే మంచి సినిమా వస్తుందని నేను నమ్ముతాను. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మేకింగ్ థియేటర్ లో ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్ చేస్తుంది.

Related posts