telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అల్లరి నరేష్ ఆశలన్నీ ఆ సినిమా పైనే…

Allari-Naresh

అల్లరి నరేష్ తన సినీ కెరీర్‌లో ఎక్కువ శాతం సినిమాల్లో  హాస్య పాత్రనే ఎంచుకున్నాడు. అతి తక్కువగా వేరే తరహా సినిమాలను తెరకెక్కించాడు. వాటిలో నేను, విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటి సీరియస్ పాత్రలను కూడా అలవోకగా చేసిన తన నటన విశ్వరూపాన్ని చూపించాడు. అయితే తాజాగా అల్లరి నరేష్ చేసిన సినిమా బంగారు బుల్లోడు. ఇది కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ప్రసాదించలేదు. దీంతో నరేష్ ఫ్లాప్‌ల ఖాతాలో మరో సినిమా చేరింది. బంగారు బుల్లోడు బాక్సాఫీస్ వద్ద ఎంతలా చతికిల పడిందంటే వారాంతాల్లో కూడా వసూళ్లు చేయలేకపోయింది. కానీ నిజానికి నరేష్ కూడా బంగారు బుల్లోడు సినిమాపై పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లు కనిపించలేదు. నరేష్ దృష్టి అంతా తన రెండో సినిమా నాందిపైనే ఉంది. ఈ సినిమాలో చాలా కాలం తరువాత నరేష్ హాస్యానికి ఇసుమంత కూడా తావులేని పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమాలో నరేష్ ఖైదీ పాత్రలో కనిపించనున్నాడు. అతడు జైలు నుంచి బయటకు వచ్చేందుకు చేసిన పోరాట నేపథ్యంలో సినిమా నడుస్తుంది. ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు విజయ్ కుమార్ కనకమేడల అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా గత ఏడాదే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని వార్తలు వచ్చాయి, కానీ విడుదల కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్‌కు నిర్మాతలు సర్వం సిద్దం అయ్యారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Related posts