telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ రామ్ చరణ్ తెలుసా?… కేటీఆర్ పంచ్ …వీడియో వైరల్

ktr

తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తన స్టైల్లో రిప్లై ఇచ్చిన విషయం మర్చిపోకముందే కేటీఆర్‌కి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత కరోనా కాలంలో ఆపదలో ఉన్నామని ఎవరైనా ట్వీట్ చేస్తే చాలు వెంటనే రియాక్ట్ అవుతూ వారికి తగిన సహాయం చేయడానికి చర్యలు చేపడుతున్నారు కేటీఆర్. ఇందులో భాగంగా ఓ ఇంటి వద్ద ఆగిన కేటీఆర్. ఎవ్వరూ బయటికి వెళ్లకండి. మూతికి మాస్క్ వేసుకునే బయటికి వెళ్లాలి. మే 3 తారీఖు వరకు.. ఆ తర్వాత ఏమిటనేది అప్పుడు చెబుతాం. పిల్లలు ఇంట్లోనుంచి పోనియకండి అంటూ ఒక పిల్లాడిని పేరు అడుగగా ఆ పిల్లాడు రామ్ చరణ్ అని సమాధానం చెప్పాక అవునా.. ఆ రామ్ చరణ్ తెలుసా నీకు.. సినిమాల్లో రామ్ చరణ్ తెలుసా..? అని సరదాగా కేటీఆర్ వారితో సంభాషించారు. ఇప్పుడీ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Related posts