telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాన్ ఇండియా సినిమాలో సమంత

Samantha

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. జానూ సినిమా తరువాత సమంత నటించిన చిత్రాలేవీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కి కొనసాగింపుగా వస్తున్న సీజన్ 2 లో సమంత కీలక నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సిరీస్ లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు సమంత. ఇది ఈ ఏడాదే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. కాగా సమంత ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ వారితో ఓ సినిమాకి సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించనున్నారట. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా సమంత కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు టాలీవుడ్ కోలీవుడ్ కే పరిమితమైన సామ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోందట. సమంత ఈ సినిమాను సింగల్ షెడ్యూల్ తో పూర్తి చేస్తారట. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts