telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీసీఎం జగన్ నిర్ణయం .. స్వాగతించాలి.. : లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ

Loksatha comments Janasena

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (జేపీ) స్పందించారు. సీఎం జగన్ వ్యాఖ్యలను స్వాగతించాల్సిందేనని ఆయన అన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో ఉంటే ఎలా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్న జేపీ, కేంద్ర బిందువుగా మాత్రం అమరావతి ఉంటే బాగుంటుందని అన్నారు.

రాష్ట్రానికి మూడు రాజాధానుల్ని నిర్మించే అవకాశం ఉందని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా అన్నారు. అసెంబ్లీలో అమరావతి నిర్మాణంపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా మాట్లాడిన జగన్ ..గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం అంటూ ఖర్చును భారీగా పెంచేసిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ప్రాంతాలవారీగా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని, అందుకోసం రాష్ట్రానికి మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వైజాగ్, అమరావతి, కర్నూల్ లో రాజధానుల్ని నిర్మించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావొచ్చన్నారు. ఈ అంశంపై ఓ కమిటీ వేసినట్లు.. వారంరోజుల్లో కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మూడు రాజధానుల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Related posts