ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాట్స్మెన్స్ అందరూ కలిసి కట్టుగా రాణించారు. అయితే వారిని మొదట రాయల్స్ బౌలర్లు కొంత ఇబ్బందే పెట్టారు. అయితే చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి విఫలమైన ఆ తర్వాత మొయిన్ అలీ(26) తో కలిసి డు ప్లెసిస్(33) ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇక వారు పెవిలియన్ చేరుకున్న తర్వాత వచ్చిన రైనా, రాయుడు అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిన చెన్నై కెప్టెన్ ధోని 17 బంతుల్లో 18 పరుగులు చేసి మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. కానీ చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన డ్వేన్ బ్రావో వేగంగా ఆడటంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు తీయగా క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండు వికెట్లు రియాన్ పరాగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే రాజస్థాన్ రాయల్స్ 189 పరుగులు చెయ్యాలి. అయితే రాజస్థాన్ జట్టులో మంచి హిట్టర్లు ఉన్నారు. చూడాలి మరి వారు ఏం చేస్తారు అనేది.
previous post
next post