telugu navyamedia
రాజకీయ

రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్

రసాయన శాస్త్రంలో 2021వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, అమెరికాకు చెందిన డేవిడ్ మెక్‌మిలన్‌లకు దక్కింది. అణు నిర్మాణం కోసం నూతన, సృజనాత్మక సాధనం అసిమెట్రిక్ ఆర్గనోకెటలిసిస్‌ను అభివృద్ధిపరచినందుకు వీరిని ఈ బహుమతికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎంపిక చేసింది.

”అణువులను నిర్మించడం చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటిది పరమాణువు నిర్మాణంలో ఆర్గానోక్యాటలసిస్‌ అనే స్పష్టమైన నూతన విధానాన్ని బెంజిమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిల్లన్‌ అభివృద్ధి చేశారు. ఇది ఔషధాల పరిశోధనల్లో గొప్ప ప్రభావం చూపించింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చింది” అని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ తన ప్రకటనలో పేర్కొంది.

సోలార్ సెల్స్‌లోని కాంతిని క్యాప్చర్ చేయగలిగే అణువులు, కొత్త ఫార్మాస్యూటికల్స్‌ వంటివాటిని పరిశోధకులు సమర్థవంతంగా అభివృద్ధిపరచడానికి ఈ రియాక్షన్స్ ఉపయోగపడతాయని పేర్కొంది. ఈ కేటలిస్టులు పర్యావరణ హితకరమైనవని, అదేవిధంగా వీటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు తక్కువ అని తెలిపింది. నోబెల్ పురస్కారం కింద 1.14 మిలియన్ డాలర్లు అందజేస్తుంది.

Related posts