telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

విమానంలో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

hijack call to gannavaram airport

గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాంపించాయి. దీంతో ప్రయాణీకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్‌, విమానాన్ని తిరిగి అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విమానంలో గోవా పర్యావరణ మంత్రి నీలేశ్‌ కాబ్రాల్‌ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్‌ తెలిపారు. పైలట్ వెంటనే ఎడమ ఇంజీన్‌ ఆపివేసి తమను తిరిగి గోవాకు ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు. తనతో సహా ప్రయాణీకులందరు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు.

Related posts