telugu navyamedia
ఆరోగ్యం

వైరల్ ఫీవర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు దాడిచేస్తాయి, చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాల ప్రభాదం తీవ్రంగా ఉంటుంది. ప్రతి పదిమందిలో ముగ్గురు- నలుగురికి జలుబు, ఇద్దరు-ముగ్గురికి జ్వరంతో కూడిన వైరల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయ‌ని వైద్య నిపుణులు అంటున్నారు.

వైరల్ జ్వరం అనేది అంతర్లీన వైరల్ అస్వస్థత లేదా వాతావరణంలో మార్పులు మరియు వాతావరణంలో ఇన్ఫెక్షన్ కారణంగా కలుగుతుంది. ఇవి సాధారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుదలను కలిగి ఉంటాయి, అంటే 98.6 డిగ్రీల ఫారెన్ హీట్ దాటుతుంది. వైరల్‌ ఫీవర్‌ సోకితే ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం,నిస్సత్తువ, స్కీన్‌ రాషెస్‌, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతునొప్పి, ముక్కు కారడం,దగ్గు, గొంతు నొప్పి, ఉదరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

3 Dietary Nutrients That May Help Reduce Seasonal Allergies - Blog - Persona Nutrition

వైరల్ ఫీవర్ ను గుర్తించేందుకు సీబీపీ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇందులో న్యూట్రోఫిల్స్‌/ పోసైడ్స్‌(N/L)శాతం 2 కంటే తక్కువగా వస్తే సదరు రోగికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నట్లు గుర్తిస్తారు.

వైరల్ ఫీవర్ ల‌క్ష‌ణాలు ..

శరీర ఉష్ణోగ్రత పెరగడం తోపాటుగా వైరల్ ఫీవర్ యొక్క సాధారణ లక్షణాలు:

*చెమట పట్టడం
*తలనొప్పి
* బలహీనత
*ఆకలి లేకపోవడం
*చలి మరియు వణుకు
*కండరాల నొప్పులు మరియు శరీర నొప్పులు

వైర‌ల్ పీవ‌ర్ నివార‌ణ‌కు..

*శుభ్రమైన మరియు బాగా మరిగించిన నీటిని మాత్రమే తాగండి.
*వర్షంలో తడవద్దు..
*నాప్ కిన్ లు, రుమాలు లేదా ఇతరులు ఉపయోగించే ఇలాంటి వస్తువులను నేరుగా తాకకండి .
*వంట చేయడానికి ముందు మాంసం మరియు అన్ని కూరగాయలను నీటితో కడగండి.
*దగ్గు వచ్చినపుడు రుమాలు ఉపయోగించండి.
*గ్లాసులు లేదా కంచాలు మరొకరితో పంచుకోరాదు.
* మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి.

Related posts