telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

‘విటమిన్ ఏ’ .. ఎంత ముఖ్యమో తెలుసా..

importance of vitamin A and available iteams

రోజువారీ ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ తో కూడి సమతుల్యత ఉండాలి. ఈ వరుసలో ముందున్న విటమిన్ ల ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువే. అందులోను విటమిన్ ఏ చాలా ముఖ్యం. మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే పోష‌కాల్లో ‘విటమిన్ ఏ’ కూడా ఒక‌టి. ఇది శ‌క్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది కొవ్వులో క‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో అనేక ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌లు దృఢంగా ఉండాల‌న్నా, చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు, ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాల‌న్నా, కంటి చూపుకు, గ‌ర్భ‌స్థ శిశువు ఎదుగుద‌ల‌కు, శరీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు.. ఇలా అనేక ర‌కాల ప‌నుల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే విటమిన్ ఏ మ‌న‌కు ఏయే ప‌దార్థాల్లో ల‌భిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కంద‌గ‌డ్డ‌ల‌లో ఇది పుష్క‌లంగా ఉంటుంది. దీనితో పాటు ఫైబ‌ర్ కూడా వీటిలో ఎక్కువ‌గానే ఉంటుంది. వీటిల్లో ఉండే ఔష‌ధ గుణాలు డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి.

2. డ్రై యాప్రికాట్ల‌లోనూ విటమిన్ ఏ పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చ‌ర్మానికి మేలు చేస్తుంది.

3. కోడిగుడ్డు ప‌చ్చ సొన‌లో విటమిన్ ఏ పుష్క‌లంగా ల‌భిస్తుంది. నిత్యం కోడిగుడ్ల‌ను తిన‌డం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. అలాగే కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. శ‌రీరం క‌ణ‌జాలానికి మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్ల‌ను తీసుకుంటే మంచిది.

4. ఇది అధికంగా ఉండే కూర‌గాయ‌ల్లో క్యారెట్ ప్ర‌ధానమైనది. క్యారెట్ల‌లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. నిత్యం క్యారెట్ల‌ను తిన‌డం ద్వారా కంటి చూపును మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది.

5. ఆకుప‌చ్చ ప‌సుపు, ఎరుపు రంగులో ఉండే అన్నిరకాల క్యాప్సికంలో విటమిన్ ఏ పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. కంటి చూపు పెరుగుతుంది.

Related posts