telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కొబ్బరి నూనె- కర్పూరం ఆ సమస్యలకు చెక్ !

కొబ్బరి నూనె వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. ఇంక కర్పూరం మనం చాలా రకాలుగా వాడుతాం. ఈ రెండింటినీ కలిపి వాడితే చాలా రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరం కలపడం వల్ల చర్మం, జట్టుకి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.

నూనె- కర్పూరం కలిపి ఇలా ట్రై చేయండి..
చర్మంపై అలర్జీ లేదా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే, కొబ్బరి నూనె-కర్పూరం కలిపి రాసుకోండి. ఇలా 2 నుంచి 3 రోజులు చేస్తే… ఇక మీకు ఆ సమస్య తొలగిపోయినట్లే.
కొబ్బరి నూనె, కర్పూరం కలిపిన తైలాన్ని మెటిమలపై రాస్తే, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా మంచి ఫలితాలు చూడొచ్చు.
కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్‌ గుణాలు ఉన్నాయి. కర్పూరం కలిపి… గోరుపై పూస్తే ఫంగస్‌ క్రమంగా తగ్గుతుంది.
కర్పూరం, నూనె… చుండ్రు సమస్యకు ఉపశమనంగా ఉంటుంది.

Related posts