telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో సినిమాకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్

Sharwanand

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం పల్లెటూరి నేపథ్యంలో కొరియోగ్రఫర్ రాజు సుందరం దర్శకత్వంలో ‘శ్రీ‌కారం’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆర్ ఎక్స్100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘మహాసముద్రం’ అనే పేరు పెట్టారు. మరో సినిమా తెలుగు-త‌మిళ భాషలో ఒకే సమయం లో చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ మరో వైవిధ్యమైన సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ అనే ఒక నూతన దర్శకుడు చెప్పిన ఒక వికలాంగుడి కథ శర్వానంద్ కు బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాలో హీరోగా నటించడానికి శర్వానంద్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడట. శర్వానంద్ గతంలో. ఎంజియుమ్ ఎప్పొధుమ్ (జర్నీ), వాజ్‌కాయ్ (రాజాధి రాజా) స్ట్రైట్ తమిళ సినిమాలు చేశాడు.

Related posts