telugu navyamedia
రాజకీయ వార్తలు

బెంగాల్ ను యుద్ధ క్షేత్రంలా మార్చేసింది.. మమతా పై శివసేన ఆగ్రహం

udhav-thackeray

పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ అధికారం నుంచి కమ్యూనిస్టులను దించేసినట్టే మమత ప్రభుత్వాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రజలుసాగనంపుతారని అన్నారు. ఇతర పార్టీల సీనియర్ నేతలు బెంగాల్‌లోకి రావడానికి మమత ఒప్పుకోవట్లేదని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌ను మమతా బెనర్జీ యుద్ధ క్షేత్రంలా మార్చారని ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.

మమత ప్రవర్తన చాలా దారుణంగా ఉందని, హింసను ప్రేరేపించడం ద్వారా బెంగాల్ ను యుద్ధభూమిలా ఆమె మార్చేశారని విమర్శించింది. మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ రాకను ఎన్నోసార్లు అడ్డుకుందని దుయ్యబట్టారు. గతంలో సీపీఎం ఇలాంటి హింసనే ప్రేరేపించిందిని, అందుకే ప్రజలు ఆ పార్టీని సాగనంపారని అన్నారు.

Related posts