ఫలితాలు వెలువడే సమయం సమీపిస్తున్న కొద్దీ .. ఏపీలో ఎన్నికల ప్రధాన పార్టీలతో పాటు ఆయా పార్టీల అధినేతలు, నాయకులు, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా, బెట్టింగ్ రాయుళ్లు ఫలానా పార్టీ గెలుపు ఖాయమంటూ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలో బెట్టింగ్ లు నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పోలీసులు, నిందితుల నుంచి రూ.10.15 లక్షల నగదు, ఒక కారు, 7 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ బెట్టింగ్ లలో మధ్యవర్తులే కీలకం. బెట్టింగ్ కాసే వారు మధ్యవర్తులకు 5 శాతం కమిషన్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా, బాండ్ పేపర్లపై అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మంగళగిరిలో నారా లోకేశ్ గెలుస్తాడని రూ.300 కోట్ల మేరకు బెట్టింగ్ లు చేసినట్టు సమాచారం.
జగన్ సుపరిపాలన అందించడం ఖాయం : లక్ష్మీపార్వతి