telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

హైదరాబాద్ : .. మినీ శిల్పారామం .. నేడే ప్రారంభం…

mini silparamam in hyderabad

ఇప్పటికే నగరంలో ఒక శిల్పారామం ఉండగా, నగర తూర్పుప్రాంతానికి కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఉప్పల్ లో మినీ శిల్పారామం నిర్మించారు. ఏడాది క్రితం దీనికి శంకుస్థాపన జరగ్గా, ఈ సాయంత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఉప్పల్ వద్ద మూసీ నదీ తీరంలో ఏర్పాటైన ఈ తాజా శిల్పారామం ప్రారంభోత్సవంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

హైదరాబాద్ నగర తూర్పు ప్రాంతంలో కూడా ఓ శిల్పారామం ఏర్పాటవడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఇక మీదట పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు జీవన నాణ్యత ప్రమాణాలు కూడా ఉన్నతీకరణ చెందుతాయని కేటీఆర్ వివరించారు.

Related posts